తిరుమల లడ్డు : తిరుమలేశుని చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం - Tirumala Laddu Ap politics
తిరుమల లడ్డు : తిరుమలేశుని చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం - Tirumala Laddu Ap politics
- నా హైందవం కోసం ప్రాణం పోయినా సిద్ధమన్న డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్
- లడ్డూ కల్తీ వ్యవహారం పై సిట్
ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- హరతి పట్టి ప్రమాణం చేసిన ttd మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
- తిరుమలకు కాలినడకన మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి
నారాయణా, గోవిందా, అనాధ రక్షక అని కోట్లాది భక్తులు సృతించి, మొక్కే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. స్వామి ప్రసాదం తయారీలో వాడే నేయి కల్తీ పై ప్రకటనలు రాష్ట్ర, దేశ ప్రపంచ వ్యప్తంగా దుమారం లేపాయి. స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిలో సీయం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వైసీపీ హయంలో దేవాలయంలో లడ్డూ తయారీలో అవక తవకలు జరిగాయని, సంప్రదాయానికి విరుద్ధమైన పనులు చేసారని విమర్శలు ఎక్కుపెట్టారు. లడ్డూ ప్రసాద తయారీతో పాటు తిరుమల స్వామి సేవా కార్యక్రమాలకి సరఫరా చేసే నేయి సప్లై విధానంలో తిరుమలలో పకడ్బందీ తనిఖీ విభాగం వుందని, అధికార కూటమి నాయకులు కావాలనే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వైసీపీ ని అప్రతిష్ట చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెదేపా హయంలో అయినా, వైసీపీ హయంలో అయినా సప్లై చేసేందుకు వచ్చిన నేయి వాహనాల నుంచి మూడు శాంపిల్స్ సేకరించి వాట్లిలో ఎ ఒక్కటిలోనూ నివేదిక సమగ్రంగా లేకుంటే వాహనాలను వెనక్కి పంపుతారని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే తనీఖీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ విషయం రాజకీయ వైఖరితో తమ పార్టీ పై, అలాగే కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా ప్రజల చూపును పక్కదోవ పట్టించేందుకే ఈ మార్గాన్ని చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారని వైసిపీ నాయకుల వాదన.
సిట్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు : తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో నిజా నిజాలు తేల్చేందుకు సీయం చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేసారు. కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ మంగళవారం వుత్తర్యులు జారీ చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీని నియమించారు. ఈ సిట్లో విశాఖ రేంజి డిఐజీ గోపీనాద్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు వుండనున్నారు.
సిట్ నియామకం పై విమర్శలు : పవిత్ర తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం జరిగిందని సీయం చంద్రబాబు నాయుడు బాహాటంగా తెలిపి ఆయన ప్రభుత్వ పరిధిలోని అధికారులతో సిట్ ఏర్పాటు చేయటం పై వైసిపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంలో విచారణకు సిబిఐ ని ఏర్పాటు చేయాలనీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాసారు కూడా. ప్రభుత్వ పరిధిలోని సిట్ అధికారుల నివేదిక కూటమి ప్రభుత్వ నిర్ణయానికే లోబడి ఉంటుందని వైసిపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు సిట్ నే ఏర్పాటు చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రమాణం : లడ్డూ ప్రసాదం విసయంలో తమ వైసీపీ పరిపాలనా సమయంలో కల్తీ జరిగిందనే
ఆరోపణలపై మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
స్పందించారు. తిరుమలలో అగ్ని సాక్షిగా హారతి పట్టి అయన ప్రమాణం చేసారు. తాము
ఎలాంటి కల్తీలకు పాల్పడలేదని, అలా చేసివుంటే తాము నెత్తురు కక్కుని చస్తామని
ప్రమాణం చేసారు. ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయరాదని తిరుమల తిరుపతి
దేవస్థానం అధికారులు కరుణాకర్ రెడ్డికి ముందస్తుగా తెలిపినా దాన్ని దిక్కరించారని
ttd నియమావళిని ఉల్లంఘించారని ఆయనను అరెస్టు చేయటం జరిగింది.
తిరుమలకు పాదయాత్రగా మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్
మోహన్ రెడ్డి : తిరుమల
లడ్డు తయారీలో కల్తీ జరిగిందనే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీయం
పవన్ కళ్యాణ్ ప్రకటనల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తిరుమల
శ్రీవారి దర్శనానికి కాలినడక వచ్చారు. ఈ నేపధ్యంలో జగన్ తిరుమల పాదయాత్ర
కార్యక్రమం రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. గోవింద నామస్మరణ చేయు భక్తులతో కూడిన బృందంతో
కూడి ఆయన పాదయాత్ర కొనసాగింది.
లడ్డూ
వ్యవహారం పై పవన్ కళ్యాణ్ స్పందన : డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీ వివాదంతో కీలకంగా
స్పందిస్తున్నారు. హైందవ ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధం అని
ప్రకటించారు. ttd లో ప్రక్షాళన జరగాలని, ఇంత
మంది హిందూ కార్మికులు, ఉద్యోగులు వుండీ కూడా తిరుమలలో ఇలాంటి సంఘటనలు జరగటం
ఎమిటని ప్రశ్నించారు. కొన్ని సందర్బాలలో అవేశపూరితంగా మాట్లాడే డిప్యూటీ సీయం పవన్
కళ్యాణ్ గారి వైఖరిని వైసీపీ నాయకులు, పలువురు ప్రముఖులు తప్పు పడుతున్నారు.

దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్ : తిరుమలలో లడ్డూ కల్తీ ఘటనకు స్పందనగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంద్ర కీలాద్రీ దుర్గమ్మ ఆలయ మెట్లు పైకి వెళ్ళే మార్గాన్ని శుద్ధి చేశారు. అయన చేపట్టిన ప్రాయక్షిత్త దీక్షలో భాగంగా మూడవ రోజు ఈ శుద్ధి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
సునిశిత
పరిశీలన, కట్టుదిట్టమైన చర్యలతోనే సాధ్యం : తిరుమల దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్లో వుండటం
ఒకింత మనం గర్వంగా చెప్పుకునే అంశం. కోట్లాది బక్తుల మనోభావాలు ఇక్కడ ఇమిడి
వున్నాయి. భక్తి ధోరణి రాజకీయం వైపు
పరుగులు పెడితే మన సాంసృతిక గౌరవం ప్రపంచ వ్యాప్తంగా దేబ్బతినే అవకాశం వుంది.
ఇప్పటికే కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రాజకీయ చొరవ, రాజకీయలబ్ది వంటి
స్వార్థాలను పక్కన బెట్టి, స్వామి దేవస్థానం, ఆ దేవదేవుడే ఈ భువి పాలకుడుగా మనం కేవలం
అయన భక్తులుగా అక్కడ కొనసాగాలి. అంతే కానీ స్వామి వారి ఆలయానికి అప్రతిస్టత తెచ్చే
ఏ విధానం చేపట్టకూడదు అనేది మన ధర్మం. సాధ్య సాద్యాలను పక్కనెట్టి కేవలం ఈ ఒక్క రోజుతోనే
అన్ని జరుగుతాయి అనే ధోరణి గల ప్రకటనలు ఎవ్వరైనా
తగ్గించాలి. స్వామి ఆలయం, స్వామి లడ్డూ విషయాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మీడియాకు గంటకో ప్రత్యేక ధారావాహికగా, మార్చేసే స్థితికి
మనం వచ్చాం. స్వామి సుప్రవాతం, స్వామి అలంకారం, స్వామి కళ్యాణం మీడీయా, టీవీ
చానళ్లలో వీక్షించే భక్తులకు ఇప్పుడు స్వామి గురించి, స్వామి లడ్డూ గురించి ఏ రాజకీయ
నాయకుడు, ఎ పార్టీ నాయకుడు ఎమీ మాట్లాడుతున్నాడు అనే జిజ్ఞాసను మనమే ప్రపంచానికి
కల్పిస్తున్నామని ఇక్కడ గుర్తించుకోవాలి. ఇప్పటికైనా పరిస్థితులను తగ్గట్లు స్వామి
ఆలయ మహోన్నతికి పాటు పడే విధంగా, భక్తులుగా పెద్దలు, పాలకులు, ప్రతిపక్షం, పాలక
మండలి సభ్యులు అందరూ మెలగాలి.
- సహాయ
న్యూస్

కామెంట్‌లు